ది గోట్‌ నుంచి 'విజయ్‌, త్రిష' మాస్‌ సాంగ్‌ విడుదల | Vijay And Trisha Song From Out Now The Greatest Of All Time | Sakshi
Sakshi News home page

ది గోట్‌ నుంచి 'విజయ్‌, త్రిష' మాస్‌ సాంగ్‌ విడుదల

Sep 23 2024 4:36 PM | Updated on Sep 23 2024 7:42 PM

Vijay And Trisha Song From Out Now The Greatest Of All Time

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్  (ది గోట్‌). తాజాగా ఈ సినిమా నుంచి మాస్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న రిలీజ్‌ అయింది. భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టింది.

ది గోట్ సినిమాలో విజయ్‍తో కలిసి స్టార్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. వారిద్దరూ కలిసి వేసిన మాస్‌ స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ పాట కూడా సినిమాకు హైలైట్‍గా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటించింది.  ది గోట్‌ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 3న స్ట్రీమింగ్‌కు రావచ్చని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement