అజిత్‌తో ఇబ్బంది పడుతున్న త్రిష | Actress Trisha Krishnan Next Movie Chance Issue | Sakshi
Sakshi News home page

బాగున్నా, బాగలేకున్నా సమస్యే.. త్రిష పరిస్థితి ఇదే

Published Mon, Feb 5 2024 9:13 AM | Last Updated on Mon, Feb 5 2024 10:44 AM

Trisha Krishnan Movie Chance Issue - Sakshi

అతివృష్టి, అనావృష్టి అన్నచందంగా ఉంది నటి త్రిష పరిస్థితి. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చైన్నె బ్యూటీ. మొదట సహాయనటిగా సినీ రంగప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా సత్తా చాటుకుంటున్నారు. ఒకానొక సమయంలో లేడీ ఓరియెంట్‌ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు అచ్చి రాలేదు. అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవిచూడడంతో త్రిష కెరీర్‌ డౌన్‌ అయిపోయింది.

అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్‌ జన్మను ఇచ్చారనే చెప్పాలి. అలా త్రిష మళ్లీ పీక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత విజయ్‌తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అజిత్‌ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థక్స్‌లైఫ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం. ఈమె ఇంతకుముందు స్టాలిన్‌ చిత్రంలో చిరంజీవితో జత కట్టారన్నది గమనార్హం.

ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది. ఎందుకు ప్రధాన కారణం అజిత్‌ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం అని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట. ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్‌షీట్స్‌కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట. ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి బాగున్న సమస్యే, బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్‌ అవుతున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement