రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..? | Is This The Reason Trisha Rejected Rajamouli Hit Movie Maryada Ramanna? | Sakshi
Sakshi News home page

రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?

Published Tue, Jun 18 2024 6:17 PM | Last Updated on Tue, Jun 18 2024 6:45 PM

Trisha Rejected Rajamouli Movie

సౌత్‌ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్‌ నుంచి హీరోయిన్‌గా  'జోడి' (తమిళ్‌) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్‌ సిమ్రన్‌కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.

డైరెక్టర్‌ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్‌ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్‌ చేశారట. అప్పటికే త్రిష స్టార్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. 

దీంతో కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌తో నటించడం వల్ల తన మార్కెట్‌ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement