అల్లు అర్జున్‌కి జోడీగా..?  | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కి జోడీగా..? 

Published Tue, Apr 2 2024 12:14 AM

Trisha Krishnan likely to join Allu Arjun in Atlee next movie - Sakshi

‘పుష్ప: ది రైజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్‌’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్‌ చేసే పనిలో పడ్డారట అట్లీ.

కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టారీ బ్యూటీ.

అలాగే ‘పుష్ప: ది రైజ్‌’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్‌ కానుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అల్లు అర్జున్‌ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్‌–అట్లీ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనుందని టాక్‌.

Advertisement
 
Advertisement