క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి, అటువ్యాధితో సతమతమవడంతోపాటు, జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకనే కీమో థెరపీ కారణంగా మొత్తం జుట్టును కోల్పోవడం సాధారణంగా చూస్తూంటాం. ఆ సమయంలో వారి మానసికవేదన వర్ణనాతీతం. అయితే అలా బాధపడుతున్న విద్యార్థిని కోసం సహవిద్యార్థులు , ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది.
క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రమంలో ఒక విద్యార్థిని జుట్టు ఊడిపోవడం ప్రారంభించింది. దీంతో స్కూల్‌కు రావడానికి భయపడింది. అందరూ గేలి చేస్తారేమోనని భయపడింది. కానీ ఆ చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. టీచర్లు, పిల్లలు గుండు కొట్టించుకొని ఆమెకు అండగా నిలిచారు. ఈ పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు, తోడుగా మేమూ ఉన్నామనే ధైర్యాన్నిచ్చారు. వారంతా సామూహికంగా గుండు చేయించుకుని ఆ చిన్నారిలో ధైర్యాన్ని నింపారు.
ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్
Girl Lost Her Hair Due To Cancer, So Classmates and Teachers Shaved Their Heads To Cheer Her Up | WATCH pic.twitter.com/oVJQnetFyv
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 19, 2026
ఇది కేవలం పాఠశాల కాదు, ప్రేమ, ధైర్యం కలగలిసిన కుటీరమని, మనిషి మనిషి ప్రేమించాలని నేర్పించే దేవాలయమని నిరూపించారు. వారు చూపించిన అప్యాయతా నురాగాలు, చేసిన గొప్ప పనిపై నెటిజన్లు ప్రశంసించారు. స్నేహానికి మారు పేరుగా నిలిచిన విద్యార్థులకు మార్గదర్శకులకు సెల్యూట్ చేయడం విశేషం. నిజానికి ఇది ఫేమ్ కోసమో, చప్పట్ల కోసమో చేసింది కాదు మనస్ఫూర్తిగా నిండుమనసుతో చేసిన చర్య. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చిన్నారి సంకోచం దూది పింజలా కరిగిపోయింది. అందరి కళ్లు భావోద్వేగంతో చెమర్చే క్షణాలివి.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్


