ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా ’స్కోర్‌క్యాహువా.బ్యాంక్.ఇన్’ పేరిట మైక్రోసైట్‌ని ప్రవేశపెట్టింది. క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకునేందుకు, రుణాల సంబంధ అంశాలు, క్రెడిట్ ప్రొఫైల్ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
క్రెడిట్ స్కోర్‌పై అవగాహన పెంచేందుకు, రుణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేసేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద దీన్ని రూపొందించినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఇందులో ఆర్థిక అంశాల సంబంధిత బ్లాగ్‌లు, వీడియోలు క్రెడిట్ స్కోరుపై అపోహలు తొలగించే సమాచారం మొదలైనవి ఉంటాయి. ఈ సందర్భంగా నాలుగు టీవీ ప్రకటనలను కూడా బ్యాంకు ఆవిష్కరించింది.


