
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల నిర్ణయం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు ఆ దేశ జాతీయ సెక్యూరిటీ మాజీ సలహాదారు జాన్ బాటమ్. భారత్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల తీరును తీవ్రంగా తప్పబట్టారాయన. కచ్చితంగా ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు.
ఎన్నో దశాబ్దాల నంచి భారత్‌తో ఉన్న మిత్రత్వం ట్రంప్ సుంకాల దెబ్బతో అది కాస్తా బెడిసి కొట్టే ప్రమాదం అధికంగా ఉందన్నారు. చైనా కంటే అత్యధిక సుంకాలు విధించడం భారత్ పట్ల వివక్ష ధోరణికి నిదర్శమన్నారు. చైనాకు సుంకాలు పెంచి ఉపశమన కల్పించిన ట్రంప్.. భారత్‌పై 50 శాతం సుంకాలంటూ బెదిరింపు చర్యలకు దిగడం అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు.
చైనాపై ఉదాసీనత కనబరిచిన ట్రంప్.. భారత్‌ను రష్యా, చైనాలను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. భారత్‌ను రష్యా, చైనాల నుంచి వేరు చేయడానికి చేసిన ట్రంప్ వ్యూహం కచ్చితంగా అతి పెద్ద తప్పిదమేనని నొక్కి మరీ చెప్పారు. సీఎన్‌ఎన్‌తో మాట్లాడిన ఆయన ట్రంప్ విధించే సుంకాలపై గురించి, ప్రత్యేకంగా భారత్‌పై విధించిన సుంకాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరొకవైపు అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, ఆ దేశ మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సుంకాలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు దీర్ఖకాలిక నష్టం కల్గించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇక్కడ అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదు అనేది తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.