
మరోసారి ప్రస్తావించిన తుర్కియే అధ్యక్షుడు
యునైటెడ్ నేషన్స్: తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి కశ్మీర్ అంశంలో వేలు పెట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఉగ్రవా ద నిర్మూలనకు భారత్–పాకిస్తాన్ మధ్య సహకారం ఎంతో అవసరమని పేర్కొ న్నా రు.
‘కశ్మీర్‌లోని మా సోదర సోదరీ మణుల సంక్షేమం కోసం ఆ సమస్య ఐరాస తీర్మానం మేరకు శాంతియుతంగా చర్చల ద్వారా పరి ష్కరించబడుతుందని ఆశిస్తున్నా. దక్షిణాసి యాలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. గత ఏప్రిల్‌లో పాక్, భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల తర్వాత కాల్పుల విరమణ పాటించటాన్ని మేం స్వాగతిస్తు న్నాం’అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు సన్ని హిత దేశంగా ఉన్న తుర్కియే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది.