ఈయూతో ట్రంప్‌ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15శాతం సుంకాలు | Donald Trump Announces Trade Deal With European Union Levies 15 Tariffs, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈయూతో ట్రంప్‌ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15శాతం సుంకాలు

Jul 28 2025 8:31 AM | Updated on Jul 28 2025 11:05 AM

Trump Announces Trade Deal with European Union Levies 15 Tariffs

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఇకపై ఈయూ దిగుమతులపై అమెరికా 15 శాతం సుంకాలను విధించనున్నదని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ దీనిని మునుపెన్నడూ లేని భారీ వాణిజ్య ఒప్పందంగా అభివర్ణించింది.

యూరోపియన్ వస్తువులపై 30శాతం అమెరికా సుంకాలను నివారించేందుకు ఆగస్టు ఒకటితో గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈయూతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే ఒప్పందం అని, బహుశా ఇది ఆ దేశంతో కుదిరిన పెద్ద ఒప్పందం అని ట్రంప్‌ వార్తాసంస్థ ఎఎఫ్‌పీకి తెలిపారు.
 

ఈ 15శాతం సుంకాలు యూరప్‌లోని కీలకమైన ఆటోమొబైల్ రంగం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లతో సహా అన్ని రంగాలకు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం  కారణంగా 27 దేశాల ఈయూ కూటమి యునైటెడ్ స్టేట్స్ నుండి 750 బిలియన్‌ డాలర్ల విలువైన  ఇంధనశక్తిని కొనుగోలు చేస్తుందని, ఈయూ 600 బిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులను  అందిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యా నుండి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా, రాబోయే మూడు సంవత్సరాలలో యూరోపియన్‌ యూనియన్‌ అమెరికా నుంచి ద్రవీకృత సహజ వాయువు, చమురు అణు ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందని వాన్ డెర్ లేయన్ తెలిపారు.

విమానాలు, కొన్ని రసాయనాలు, పలు వ్యవసాయ వస్తువులు, కీలక ముడి పదార్థాలు  తరహా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు  ఇరు దేశాలు అంగీకరించాయని ఆమె పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈయూ పలు సుంకాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంది.  కార్లపై 25శాతం పన్ను, ఉక్కు, అల్యూమినియంపై 50శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒప్పందం కుదరకపోతే ఈ 10శాతం సుంకాల రేటు 30శాతం వరకు పెరుగుతుందని అమెరికా హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement