
అమెరికా విధించిన 50% టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. ‘అధిక ఉపాధి కల్పిస్తున్న కొన్ని పరిశ్రమలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ ప్రభావం ఎంతన్నది ప్రభుత్వం మదిస్తోంది. తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తోంది’ అని చెప్పారు.