టారిఫ్‌లను కొంత తగ్గిస్తాం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఒప్పందానికి సమీపంలో భారత్
వాషింగ్టన్: భారత్‌తో న్యాయబద్ధమైన వాణిజ్య ఒప్పందం అతి సమీపంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ఓకే అయిన పక్షంలో భారత్ వస్తువులపై కొంతమేర టారిఫ్‌లను తగ్గిస్తామన్నారు. అయితే, భారత్‌తో కుదరబోయే ఒప్పందం, గతంలో వాటికంటే భిన్నంగా ఉంటుందన్నారు. ‘ప్రస్తుతానికి వాళ్లు నన్ను ఇష్టపడటం లేదు. ఒప్పందం కుదిరితే మళ్లీ నన్ను తిరిగి ప్రేమిస్తారు’అని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇతర వివరాలను వెల్లడించలేదు. రెండు వారాల వ్యవధిలో ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం ఇది రెండోసారి. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం అతిత్వరలోనే కుదరనుందంటూ ఇటీవల ట్రంప్ ప్రకటించడం తెల్సిందే.
అయితే, తాజాగా ఆయన చేసిన ప్రకటన ఎప్పటి మాదిరిగానే అతిశయోక్తా?, లేక ఒప్పందం కోసం రెండు పక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో నిజంగానే పురోగతి ఉందా?అనేది స్పష్టం కావాల్సి ఉంది. భారత్‌లో రాయబారిగా నియమితులవనున్న సెర్గియో గోర్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణం చేయించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు. ‘చర్చల్లో వాళ్లు(భారత్) సిద్ధహస్తులు. సెర్గియో, వీలైతే ఈ విషయం నువ్వు చూసుకో’అని పేర్కొన్నారు. అదేవిధంగా, రష్యా ఆయిల్‌ను కొంటున్నందునే భారత్‌పై అత్యధికంగా టారిఫ్‌లు వేశామన్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన పక్షంలో టారిఫ్‌లను కొంతమేర తగ్గిస్తామని చెప్పారు. ఇదే సమయంలో గత అధ్యక్షుడు బైడెన్‌పై పాత ధోరణిలోనే విమర్శలు గుప్పించారు. ‘బైడెన్‌కు భారత్ గురించి తెలియదు. అతడికి అసలేమీ తెలియదు. ఇప్పుడు మేం ఏం చేస్తున్నామో చూడండి’అంటూ బడాయిగా మాట్లాడారు


