పెరగనున్న మొండిబాకీలు
క్రిసిల్ నివేదిక
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాల పోర్ట్‌ఫోలియోలో మొండిబాకీల (ఎన్‌పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది. గత ఆరి్థక ఆఖరులో 3.59 శాతంగా ఉండగా, ఈసారి 3.7–3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం ఇందుకు కారణం కానుంది. క్రిసిల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
టెక్స్‌టైల్స్, గార్మెంట్స్..కార్పెట్స్, రత్నాభరణాలు, రొయ్యలు తదితర ఎగుమతుల ఆధారిత ఎంఎస్‌ఎంఈలపై టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని సంస్థ డైరెక్టర్ శుభ శ్రీ నారాయణన్ తెలిపారు. ఆరి్థక వృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న వ్యాపారాలకు మరింతగా రుణాలివ్వాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల రిసు్కలు కూడా ఉంటాయని గుర్తించాలని నివేదిక సూచించింది. గతంలో కూడా ఎంఎస్‌ఎంఈలు వేగంగా వృద్ధి చెందినప్పుడు, కొన్నాళ్ల తర్వాత ఎన్‌పీఏలు భారీగా పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈల రుణాలు సుమారు 17 శాతంగా, కార్పొరేట్ రుణాలు 38 శాతంగా ఉంటాయి. రిటైల్ లోన్‌లకు సంబంధించి అన్‌సెక్యూర్డ్ విభాగంలోనూ రుణ నాణ్యతపై ఓ కన్నేసి ఉంచాల్సి వస్తుందని తెలిపింది.


