ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది  | US economist quips Trump tariffs on India with a mouse hitting an elephant jibe | Sakshi
Sakshi News home page

ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది 

Aug 30 2025 6:21 AM | Updated on Aug 30 2025 6:21 AM

US economist quips Trump tariffs on India with a mouse hitting an elephant jibe

భారత్‌పై అమెరికా చర్యల పట్ల అమెరికన్‌ ఆర్థికవేత్త వ్యాఖ్య

వాషింగ్టన్‌: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్‌ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్‌ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్‌పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్‌ ఆర్థికవేత్త రిచర్డ్‌ వోల్ఫ్‌ విమర్శించారు. 

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్‌ సుంకాలు బ్రిక్స్‌ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్‌ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్‌ మాట్లాడారు.  

బ్రిక్స్‌ దేశాలను బలోపేతం చేస్తోంది..  
‘భూమిపై అతిపెద్ద దేశం భారత్‌. సోవియట్‌ యూనియన్‌ కాలం నుంచే అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ మర్చిపోతున్నారు. భారత్‌కు అమెరికా మార్కెట్‌ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్‌ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్‌ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్‌ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్‌ వ్యాఖ్యానించారు.  

అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. 
‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్‌ ఎగుమతిదారులూ రిస్‌్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్‌ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్‌ విశ్లేషించారు.  

బ్రిక్స్‌ దేశాలకు బెదిరింపులు.. 
బ్రిక్స్‌ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్‌ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్‌ అనేక సందర్భాల్లో బ్రిక్స్‌ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్‌ చచి్చపోయిందన్నారు. డాలర్‌ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement