అమెరికా సుంకాలకు ఇండియన్‌ యూనివర్సిటీ ఝలక్‌ | Swadeshi 2 0 Indian University Boycotts American Soft Drinks | Sakshi
Sakshi News home page

అమెరికా సుంకాలకు ఇండియన్‌ యూనివర్సిటీ ఝలక్‌

Aug 27 2025 8:56 PM | Updated on Aug 27 2025 9:12 PM

Swadeshi 2 0 Indian University Boycotts American Soft Drinks

అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.

ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.

నిషేధానికి కారణం
అమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.

ఆందోళలో వ్యాపార వర్గాలు
యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 
ఈ చర్య పంజాబ్‌లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement