అమెరికా ప్రకటన
దావోస్: రష్యా నుంచి ముడి చమురును కొనే దేశాలపై తాము 25 శాతం అదనపు టారిఫ్‌ను విధించడం మొదలెట్టాక రష్యా నుంచి భారత్ క్రూడ్‌ఆయిల్ కొనుగోళ్లు ఆగిపోయాయని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న బీసెంట్ అక్కడ ఫాక్స్ బిజినెస్ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలయ్యాకే రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు జోరందుకున్నాయి.
ఇటీవల మేం పాతికశాతం అదనపు టారిఫ్ విధిండంతో తాజాగా ఆ కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇంకా చమురు కొని ఇతర దేశాలకు తిరిగి విక్రయిస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ వేయాలనే బిల్లును సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచిచూడాలి. రష్యా చమురును యూరప్ దేశాలు కొంటే రష్యాకు ఆర్థిక లాభాల పంట పండిస్తున్నాయి. ఇలా పరోక్షంగా యూరప్ దేశాలు తమపైనే రష్యా యుద్ధానికి ఆర్థికసాయం చేస్తున్నాయి’’ అని బీసెంట్ అన్నారు.


