భారత్‌కు మరోసారి అమెరికా సుంకాల షాక్‌ | US proposes up to tariff on India 59 other economies over forced labour | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరోసారి అమెరికా సుంకాల షాక్‌

Jun 3 2026 12:26 PM | Updated on Jun 3 2026 1:47 PM

US proposes up to tariff on India 59 other economies over forced labour

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌మరోసారి భారత్‌కు షాకిచ్చారు. బలవంతపు  కార్మిక విధానానికి (forced labour) నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య  భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు (tariffs) విధించాలని అమెరికా  సిద్దమవుతున్నారు. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5 శాతం వరకు అదనపు టారిఫ్‌లు (పన్నులు) విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో (వెట్టిచాకిరీ/forced labour) తయారైన వస్తువులపై నిషేధాన్నివిధించడంలో లేదా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫల మయ్యాయని USTR నిర్ధారించింది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. 

భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం.  ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్ , యూ​కే,  చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు స్విట్జర్లాండ్‌ తదితర దేశాలున్నాయి. ఇందులో కెనడా, మెక్సికో, తైవాన్ , యూ​కే లపై 10 శాతం సుంకాలు,  ఇతర దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకం విధించనుంది. 

దీని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని యూఎస్‌టిఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. అవి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటనుంది. అలాగే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి.  కానీ, ఒకవేళ ఇవి అమలులోకి వస్తే, సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ చర్య వీలు కల్పిస్తుంది.

ఇదీ చదవండి: కజిన్‌ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్‌.. చూడలేం!

బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో  ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలమవడం ఆమోదయోగ్యం కాదని USTR జామీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విఫల విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ, మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. (అమెరికా చట్టాల తరహాలో భారతదేశంలో ప్రస్తుతం బలవంతపు శ్రమ వస్తువుల దిగుమతిపై ప్రత్యేక నిషేధ చట్టమేదీ లేదు.)

అయితే, ప్రతిపాదిత సుంకాలతో పాటు గొడ్డు మాంసం, కాఫీ, కొన్ని రకాల పండ్లు మరియు గింజల వంటి వాటికి వివిధ మినహాయింపులు ఉన్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి లోబడి ఉండే కెనడా మరియు మెక్సికో వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని వస్త్రాలు, దుస్తులకు కూడా. జూలై 6 లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. 

ఇదీ చదవండి: కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం


 

Advertisement
 
Advertisement
Advertisement