
సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, అమెరికా నిర్ణయం
వర్చువల్ విధానంలో కొనసాగనున్న చర్చలు
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య మంగళవారం ఢిల్లీలో చర్చలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పందం ఉండాలని తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు పూర్తి సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చర్చలను త్వరగా ముగించడానికి ప్రయత్నాలు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
భారత్‌తో వాణిజ్య చర్చల కోసం అమెరికా నుంచి వచి్చన బృందానికి బ్రెండాన్ లించ్ నేతృత్వం వహించారు. ఆయన దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధిగా పని చేస్తున్నారు. చర్చల కోసం తన బృందంతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రోజంతా చర్చలు జరిగాయి. భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకోవడం విశేషం. 50 శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధ