అమెరికా అధ్యక్షుడి విధానాలపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో చేస్తున్న ఆర్థిక దాడిని యోగా గురువు బాబా రాందేవ్ తప్పుబట్టారు. ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్థిక యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి ఆర్థిక యుద్ధానికైనా ‘స్వదేశీ’యే సరైన పరిష్కారమని రాందేవ్ తెలిపారు.
మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంట మహనీయులు ఇదే విషయం చెప్పారన్నారు. ఆత్మ నిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబన స్వదేశీకి కీలకమన్నారు. అమెరికా అవలంభిస్తున్న విస్తరణ, సామాజ్రావాద ధోరణుల నేపథ్యంలో దేశీయంగా తయారైన ఉత్పత్తులు, వస్తువులను కొనడం ద్వారా అందరం అభివృద్ధి చెందుతామన్నారు.


