
89 పైసలు దిగజారి 87.80 వద్ద ముగింపు
ముంబై: భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.
2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి.