రీసెంట్ టైంలో ట్రెండింగ్ హీరోయిన్ అంటే కచ్చితంగా వినిపించే పేరు కాయదు లోహర్. 'ముఖిల్ పేట్టై' అనే కన్నడ మూవీతో హీరోయిన్ అయిన ఈ అస్సామీ బ్యూటీ.. 'అల్లూరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే తమిళంలో 'డ్రాగన్' చేసింది ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి చిత్రాలతో వచ్చింది. ఇప్పుడు సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది. రెండురోజుల క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 16 ఏళ్లున్నప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)
'పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్‌కు వెళ్తుండేదాన్ని . ఒకరోజు ఒక కుర్రాడు నన్ను ఫాలో అవుతూ ఈవ్ టీజింగ్ చేశాడు. పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ నా వెంట పడుతూ హద్దులు మీరడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే పక్కనే ఉన్న పెద్ద రాయి తీసి అతడి తల మీద కొట్టా. రక్తం కారడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని కాయాదు లోహర్ గుర్తుచేసుకుంది.
చూడటానికి నేను చాలా సాఫ్ట్‌గా కనిపించినా.. ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుందని, దానికి ఎదురు వెళ్తాను. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని కాయదు చెప్పుకొచ్చింది. ఈమె నాని 'ప్యారడైజ్' మూవీలోనూ నటిస్తోంది. వచ్చే నెల చివరలో ఆ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత)


