ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Jul 1 2026 2:10 AM | Updated on Jul 1 2026 2:10 AM

రామవరప్పాడు: ఎంఎస్‌ఎంఈలు ఎగుమతుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎలీప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్వరూపారాణి అన్నారు. ప్రపంచ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం–2026 సందర్భంగా ఎనికేపాడులోని రతన్‌ టాటా ఇన్నొవేషన్‌ హబ్‌లో మంగళవారం ఎలీప్‌, ప్రపంచ బ్యాంకు, ఎపీఎంఎస్‌ఎంఈడీసీ, ఆర్టీఐహెచ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎగుమతి అవకాశాలపై’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎలీప్‌ అందిస్తున్న పారిశ్రామిక వాడలు, ఇంక్యుబేషన్‌ సదుపాయాలు, డబ్ల్యూఈఐటీటీసీ ద్వారా అంతర్జాతీయ ఎగుమతులపై అవగాహన వంటి వాటిపై కూడా తమ సంస్థ సహాయపడుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ మధు మాట్లాడుతూ.. నాణ్యత, ఆవిష్కరణ, ఎగుమతి ప్రమాణాలను పాటిస్తే చిన్న పరిశ్రమలు ప్రపంచ మార్కెట్‌లో విజయవంతంగా నిలవగలవని తెలిపారు. ఎఫ్‌ఐఈవో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రఘనాథ్‌ బాబు ప్రపంచ మార్కెట్‌ అవకాశాలు, ఎగుమతి సంసిద్ధతపై అవగాహన కల్పించారు. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ డెప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పూర్ణిమ ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలను వివరించారు. ఆన్‌లైన్‌లో డీజీఎఫ్‌టీ డెప్యూటీ డైరెక్టర్‌ ఫణి కిరణ్‌ ఎగుమతి విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, డీసీఎఫ్‌టీ సేవలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఎలీప్‌ చైర్‌పర్సన్‌ కనకదుర్గ, ఎలీప్‌ రీజనల్‌ ఆఫీసర్‌ సునీత, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, మహిళా వ్యాపారవేత్తలు, యువత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement