శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

న్యూస్‌రీల్‌

అందరికీ ఇస్తాం..

పెడన: యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. గత ఏడాది బారులు తీరి.. వేకువ జాము నుంచే క్యూ లైన్లలో నిలబడి వెళ్తే.. సాయంత్రం లేదా మరుసటి రోజున తెచ్చుకున్న పరిస్థితులను రైతన్నలు మరచిపోలేదు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగానే మేల్కొని యూరియా బస్తాలను తెచ్చుకుని ఇంటి వద్ద పెట్టుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆర్బీకే(రైతు సేవా కేంద్రాలు)ల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఒక పక్క అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఎకరానికి 45 కిలోల బస్తా ఇచ్చామని చెబుతున్నా.. రైతులు క్యూ కడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్న వారికే ఇస్తామన్న వ్యవసాయశాఖ, ఆ తరువాత చాలా మంది వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేవని గుర్తించి ఓటీపీ చెబితే చాలు గ్రామ వ్యవసాయ సహాయకుల ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ఇచ్చి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని పేర్కొనడంతో రైతులు క్యూ కడుతున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత..

వ్యవసాయశాఖలో వీఏఏలు తక్కువగా ఉండటంతో వారికి అదనపు డ్యూటీలు పడుతున్నాయి. దీనికి తోడు యూరియా బుకింగ్‌తో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. పెడనకు వీఏఏ లేకపోవడంతో మడక వీఏఏ సుభాష్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఈయన మడక వెళ్లిన సమయంలో పెడనలో యూరియా కోసం ఇబ్బందులు పడకుండా ఉండానికి పెడన వద్ద కొంకేపూడి వీఏఏ నాగేశ్వరరావుకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. మడకలో మూడు రోజులు, పెడనలో మూడు రోజులు విధులు నిర్వర్తించేలా సుభాష్‌కు బాధ్యతలను అప్పగించారు. మూడు రోజులు కొంకేపూడి వీఏఏ పెడనలో ఉండ టంతో కొంకేపూడి రైతులు సైతం యూరియా కోసం బుక్‌ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు పెడనకు వెళ్లిపోతున్నారు. పెడన వారు మడక గ్రామానికి వెళ్లి యూరియా కోసం లైనులో నిలబడితే మడక రైతులు పెడన వారికి ఇక్కడ రాయడానికి వీల్లేదని చెబుతుండటంతో వీఏఏలు రైతులకు సర్దిచెప్పి క్యూ లైన్‌ కట్టించి రాసి పంపిస్తున్నారు. నడుపూరు వీఏఏ మూడు రోజులు నడుపూరులోను, మరో మూడు రోజులు కూడూరు గ్రామంలో రైతులకు అందుబాటులో ఉంటూ యూరియా బుక్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

పరిస్థితి చేయిదాటిపోకుండా..

పెడన, మడక గ్రామాలకు చెందిన రైతులకు యూరియా బుక్‌ చేసుకోవడానికి పెడన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలోని పశు సంవర్ధకశాఖ, అగ్రి ల్యాబ్‌లో యూరియా బుకింగ్‌ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మడక, పెడన ప్రాంతాలకు చెందిన రైతులు యూరియా కోసం మూకుమ్మడిగా ల్యాబ్‌కు చేరుకోవడంతో వారందరికీ కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఒక్కొక్కరికీ రాసి, కార్డులు అందజేసి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రోజుకు 40 నుంచి 50 మంది రైతులకు మాత్రమే క్యూఆర్‌కోడ్‌ ఇస్తున్నారు. దీంతో మరింత జాప్యం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

యూరియా కోసం వీఏఏ వద్ద తమ వంతు ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్న రైతులు

టీడీపీ నేతల వీరంగం

నాడు

యూరియా అందుబాటులో ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కార్డు కూడా ఇస్తూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా యూరియా అందజేస్తున్నాం. విత్తనాలు వేయకుండానే రైతులు యూరియా కోసం వచ్చేస్తున్నారు. విత్తనాలు వేసి మొలకలు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించాం. మండలంలోని 11 సొసైటీలలోను, మన గ్రోమోర్‌ ద్వారా 385 టన్నులు యూరియా సిద్ధంగా ఉంది. మరో వంద టన్నుల కోసం ప్రతిపాదనలు పంపించాం. క్యూఆర్‌ కోడ్‌ తీసుకున్న చాలా మంది రైతులు తరువాత తీసుకుంటామని వెళ్లిపోతున్నారు. ఈ క్యూ ఆర్‌ కోడ్‌ రెండు రోజులకు మించి ఉండదనే విషయాన్ని రైతులు గమనించాలి.

– సజ్జా జెన్నీ, ఏవో, పెడన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement