యనమలకుదురు ఆలయ హుండీ ఆదాయం రూ.14,20,491 | - | Sakshi
Sakshi News home page

యనమలకుదురు ఆలయ హుండీ ఆదాయం రూ.14,20,491

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

పెనమలూరు: యనమలకుదురులోని శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం హుండీ కానుకలను బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారుల సమక్షంలో లెక్కించారు. 125 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు రూ 14,20,491 ఆదాయం వచ్చింది. బంగారం 6 గ్రాముల 330 మిల్లీ గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్‌ డాలర్లు 30, సౌత్‌ ఆఫ్రికన్‌ 100 ర్యాండ్‌ ఒక నోటు, థాయ్‌ల్యాండ్‌ 20 డాట్‌ రెండు నోట్లు, యూకే 5 పౌండ్‌ ఒక నోటు హుండీలో భక్తులు వేశారు. జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్‌ లలిత, యనమలకుదురు కనకదుర్గ అమ్మవారి ఆలయ ఈవో యు.వీ.ప్రసాదరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, సేవా సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement