కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026 నేడు పీజీఆర్‌ఎస్‌ ‘మాగల్లు’లో విద్యారణ్యభారతీస్వామి దుర్గమ్మకు పలువురి విరాళాలు –8లోu లక్ష్యాన్ని మించి పోలియో చుక్కలు

న్యూస్‌రీల్‌

102.54 శాతం నమోదు డీఐఓ డాక్టర్‌ కె. ప్రేమ్‌చంద్‌

‘సర్‌’ పదనిసలు

సగం సైతం పూర్తి కాని ఫారాల పంపిణీ 87.53 శాతం పూర్తి చేశామంటూ అధికారుల ప్రకటనలు కానీ డిజిటలైజేషన్‌ చేసినవి కేవలం 1,84,411 ఫారాలు మాత్రమే అధికారులు ప్రకటనలకు, వాస్తవానికి తేడాలున్నాయంటున్న రాజకీయపక్షాలు గడువులోపు పూర్తి చేయలేమంటున్న బీఎల్వోలు గందరగోళానికి గురవుతున్న ఓటర్లు

గడువులోపు కష్టమే అంటున్న బీఎల్వోలు!

డిజిటలైజేషన్‌ స్వల్పమే

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. జిల్లా అధికారులు 10 గంటలకు హాజరుకావాలన్నారు.

నందిగామ రూరల్‌: మాగల్లు వైకుంఠ నారాయణ క్షేత్రానికి జగద్గురు శంకరాచార్య హింపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి ఆదివారం రాత్రి విచ్చేశారు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు.

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా సాగిందని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి (డీఐఓ) డాక్టర్‌ కె. ప్రేమ్‌చంద్‌ తెలిపారు. ఐదేళ్లలోపు 1,45,588 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 1,49,286 మందికి పోలియో చుక్కలు వేయడంతో 102.54 శాతం లక్ష్యసాధన నమోదైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లు, మొబైల్‌ బృందాలు, ట్రాన్సిట్‌ బృందాలతో కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించినట్లు చెప్పారు. బూత్‌లకు రాని చిన్నారులను గుర్తించి ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించడంతో జిల్లా లక్ష్యాన్ని అధిగమించగలిగామని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించిన వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో తప్పనిసరిగా వేస్తామని డాక్టర్‌ ప్రేమ్‌ చంద్‌ పేర్కొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ అధికారుల ప్రకటనలు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందన్న చర్చ జోరందుకుంది. జిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో సర్వేకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటరు జాబితాకు సంబంధించి అధికారులు నియమించిన బీఎల్వోలు పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నం కాకపోవటంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పొంతన లేని ప్రకటనలు

జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసేందుకు 1,792 మంది బీఎల్వోలను ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌ల ప్రకారం ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా 14,99,852 మందికి ఫారాలను అందించే కార్యక్రమం 87.53 శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో అంతమేర పంపిణీ జరగలేదని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా ప్రాంతాల్లోని ఓటర్లుకు ఫారాలు అందలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కొండ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు చేరని ఫారాలు

విజయవాడలో పశ్చిమ, తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి చాలా డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమలోని సగం ప్రాంతం కొండ ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ నివాసితులకు ఇప్పటి వరకూ చాలా మందికి ఫారాలు అందలేదని చెబుతున్నారు. వారిలో చాలా మంది ఉదయం పనులకు వెళ్లి రాత్రికి ఇళ్లకు చేరుకుంటారు. ఈ సర్వే గురించి వారికి అవగాహన లేకపోవటం, బీఎల్వోలు ఆ దిశగా పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మార్గదర్శకాలను పాటించాలంటున్న రాజకీయ పక్షాలు

చాలా మంది బీఎల్వోలు ఆయా ప్రాంతాల్లో ఒక చోట కూర్చొని వచ్చిన వారికి తమ వద్ద ఉన్న ఫారాలను అందజేసి తిరుగు పయనమవుతున్నారు. దీంతో బూత్‌లో ఉన్న ఓటర్లందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఒక ఇంటిలో నాలుగైదు ఓట్లు ఉంటే కేవలం రెండు ఫారాలు అందించి మిగిలినవి తర్వాత ఇస్తామని చెబుతున్నా రని, మళ్లీ వాటిని ఇవ్వడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీఎల్వోలు మార్గదర్శకాలను అనుసరించి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

అధికారులు ప్రకటిస్తున్నట్లుగా 14,99,852 మందికి (87.53 శాతం) ఫారాలను అందించే కార్యక్రమం పూర్తి చేస్తే కేవలం 1,84,411 ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్‌ అయినట్లుగా అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి రెండిటి మధ్య పొంతన లేదనే విషయాన్ని వారే స్పష్టంగా చెబుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతాధికారులు సర్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో బీఎల్వోలు చురుకుగా లేరనే విషయాన్ని గమనించటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఓటర్లు తమ ఓట్లను కోల్పోయే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేకు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ గడువు ఉంది. నగరంలోని చాలా మంది బీఎల్వోలు గడువులోపు ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న బీఎల్వోలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు లేఖలు పంపినట్లు తెలిసింది. పశ్చిమలో ఇద్దరు, తూర్పు, సెంట్రల్‌లో సుమారుగా పది మంది బీఎల్వోలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వారి నుంచి సంజాయిషీ కోరినట్లుగా తెలిసింది. కొంతమంది బీఎల్వోలు తమ వ్యక్తిగత సమస్యల కారణంగా కొండ ప్రాంతాల్లో తిరగలేమని చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement