గన్నవరం: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ద్వారా అర్హులైన పేద ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు శనివారం గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో పర్యటించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే ప్రభుత్వం సర్ పేరుతో కుట్రపూరిత ప్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఓటర్ల వెరిఫికేషన్‌కు 2002 సంవత్సరాన్ని కట్ ఆఫ్ ఇయర్‌గా తీసుకోవడం అత్యంత అహేతుకమన్నారు. ఈ ప్రకియంతో వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు 2002 రికార్డులు చూపలేక ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, నేతలు కళ్లం వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు


