పామర్రు: మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళా పీఠంలో సర్టిఫికెట్, డిప్లొమా థియరీ రాత పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు బుధవారం వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా టీచింగ్ అసిస్టెంట్లు పసుమర్తి హరినాథ శాస్త్రి, వేదాంతం వెంకట దుర్గాభవాని, అబ్జర్వర్లుగా ఓఎస్‌డీ ఆచార్యులు, నిరీక్షణబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తొలిరోజు సర్టిఫికెట్ పరీక్షకు 60 మందికి 56 మంది హాజరయ్యా రని తెలిపారు. మంగళ, బుధవారాల్లో డిప్లమో పేవర్–1, పేపర్–2 రాత పరీక్షలు జరుగుతా యని వివరించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలి : ఫ్యాప్టో
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సభ్య సంఘాల సమావేశం సోమవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఫ్యాప్టో) జిల్లా కార్యా లయంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను వెంటనే రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని నాయకులు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు జులై 14న కలెక్టరేట్ ముట్టడిలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంపటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షను కొనసాగించడం సమంజసం కాదని, వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ నాయకుడు కష్ణమూర్తి, ఏపీటీఎఫ్ నాయకులు రేణుకరావు, శివరామకష్ణ, బీటీఏ నాయకుడు సూరిబాబు, డీటీఎఫ్ నాయకుడు కొంపటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు
అందించిన టీడీపీ నేత
అవనిగడ్డ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా మండలంలోని దక్షిణ చిరువోలులంకలో టీడీపీ నేత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకుడు కొల్లూరి వెంకటేశ్వరరావు ఓటర్ల నమోదు కార్యక్రమం పరిశీలన కోసం సోమవారం దక్షిణ చిరువోలులంక గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ ఓటర్లకు అందించాల్సిన ఫారాలను కొల్లూరి అందించి ఫొటోలు దిగడం గమనార్హం.
ముగిసిన సురభి నాటకోత్సవాలు
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు సోమవారం ముగి శాయి. చివరి రోజు ప్రదర్శించిన భూ కౌలాస్ నాటకం ఆద్యంతం అలరించింది. తల్లి కై కసి కోరిక మేరకు శివుడి ఆత్మలింగం కోసం రావ ణుడు తపస్సు చేయడం, ఆయనలో మాయ ప్రవేశించి మాత పార్వతిని ఇల్లాలిగా కోరుకోవడం, ఆ తరువాత తప్పు తెలుసుకుని శివుడికి శిరస్సు అర్పించడం, భోళా శంకరుడు ఆత్మ లింగం సమర్పించడం, నారదుడి మాయచేత శివలింగం భూమి మీదనే ప్రతిష్ఠం కావడం తదితర అంశాలతో ఈ నాటకం సాగింది. రావణ బ్రహ్మగా దినకర, శివుడిగా శివయ్య, నారదుడిగా పరిమళ, విరూపాక్షుడిగా శుభకర, మండోదరిగా మానస వీణ అద్భుతంగా నటించారు. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు. మంగళవారం ప్రేక్షకుల కోరిక మేరకు మంగళవారం ప్రత్యేక ప్రదర్శనగా మాజా బజార్ నాటక ప్రదర్శ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


