మీ కోసంలో 147 అర్జీలు స్వీకరణ కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలు, ఉద్యోగుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఇన్‌చార్జ్ డీఆర్వో పి.పోతురాజు, అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో అమృతకృష్ణ పథకం ద్వారా గాజుల సీసాల మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కలెక్టరేట్‌లోని జిల్లా అధికారులు వారికి కావాల్సిన మంచినీటిని ఆ కేంద్రం నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. పనితీరు సరిగా లేని అధికారులను వచ్చే వారం నుంచి జిల్లా కేంద్రానికి పిలిపిస్తామన్నారు. యువత మత్తు పదార్థాల నుంచి బయటపడేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జీవితం ఎంతో అమూల్యమైనదని, ఆశయంతో ముందుకు సాగాలని, ఆత్మహత్య పరిష్కారం కాకూడదని తెలియజేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సహాయం కోసం 14416 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. మీకోసంలో ఉద్యోగుల నుంచి ఆరు అర్జీలు, ప్రజల నుంచి 147 అర్జీలను అధికారులు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని


