కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి మిర్చి లోడు లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంతో రోడ్డు దాటుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొండపల్లి శ్రామికనగర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం వైపు నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న మిర్చి లోడు లారీ రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయింది. ఈక్రమంలో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంతో రోడ్డు దాటే వ్యక్తికి కూడా గాయలయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్‌ఐ శివరామకృష్ణ, ఎస్‌ఐ చక్రధర్ మున్సిపాల్టీ సిబ్బంది సాయంతో మిర్చి బస్తాలను రోడ్డు పక్కకు చేర్పించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. లారీని క్రేన్‌ల ద్వారా పక్కకు తొలగించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


