కారు ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఒకరి మృతి

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

కారు ఢీకొని ఒకరి మృతి పెనమలూరు: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా డెలివరీ బాయ్‌ మృతి చెందిన ఘటనపై పెనమలూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకనారాయణ కథనం మేరకు.. నాగాయ లంక ప్రాంతానికి చెందిన కట్టా వరప్రసాద్‌(41) డెలివరీ బాయ్‌ జీవిస్తున్నాడు. విధుల్లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అతడిని పోరంకి స్లేట్‌ స్కూల్‌ రోడ్డులో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య భవాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగం పేరిట రూ.2 లక్షలకు టోపీ

కంచికచర్ల: ఇంజినీరింగ్‌ చదివిన యువకుడు వర్క్‌ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఉద్యోగం ఇస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి టెలిగ్రామ్‌ నమ్మించి రూ.2 లక్షలు కాజేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్‌ కథనం మేరకు.. కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన వెంపరాల త్రిసాయి వర్క్‌ఫ్రం హోం ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. ఓ ఆగంతకుడు వాట్సప్‌, టెలిగ్రామ్‌ ద్వారా అతనికి పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా ఫోన్‌ పనిచేయటం లేదు. మోసపోయానికి గుర్తించిన త్రిసాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement