ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులు పడొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులు పడొద్దు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులు పడొద్దు

పెడన: రైతులు తమ పంట పొలాలకు కావాల్సిన ఎరువులను స్మార్ట్‌ ఫోన్లు ద్వారా బుక్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారిణి జ్యోతిరమణి సూచించారు. స్మార్ట్‌ ఫోన్లు లేని రైతులు తమ ఇంట్లో ఎవరి ఫోన్‌ తెచ్చుకున్నా లేదా వీఏఏ ఫోన్‌ ద్వారా కూడా ఎరువులను బుక్‌ చేయొచ్చని చెప్పారు. బుధవారం మండల పరిధిలోని నందమూరు గ్రామంలోని రైతుసేవా కేంద్రంలో ఎరువుల బుకింగ్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం యాప్‌కు సంబంధించి కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సందేహాలను వెలుబుచ్చడంతో ఆమె నివృత్తి చేశారు. ప్రస్తుతం మొదటి డోస్‌గా రైతుకు ఒక యూరియా కట్ట మాత్రమే అందజేస్తున్నామని, ఆ తరువాత మళ్లీ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఏడీఏ ఎన్‌ రమాదేవి, పెడన ఏవో సజ్జాజెన్నీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయశాఖాధికారి జ్యోతిరమణి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement