అల్లూరి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

అల్లూరి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అల్లూరి.. స్వాతంత్య్రోద్యమంలో చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి భారతచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ ప్రజలకు చిరస్మరణీయమన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ సైకిల్‌పై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వచ్చారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఇన్‌చార్జ్‌ డీఆర్వో పోతురాజు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక, సూపరింటెండెంట్లు నెల్సన్‌పాల్‌బాబు, ఎం.హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement