ప్రాధాన్యతాక్రమంలో ఫిర్యాదుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతాక్రమంలో ఫిర్యాదుల పరిష్కారం

Jun 30 2026 3:17 AM | Updated on Jun 30 2026 3:17 AM

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మీ – కోసం కార్యక్ర మంలో అందిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీ–కోసంలో పాల్గొన్న ఆయన సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కొన్ని ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఇంకొన్ని అర్జీలను స్టేషన్‌లకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ–కోసంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపిన అనంతరం చట్టపరిధిలో పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది తమ తమ స్టేషన్‌లకు అందిన అర్జీలను కూలంకుషంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని వీలైనంత వరకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సోమవారం జరిగిన మీ–కోసంలో మొత్తం 47 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.

ముఖ్యమైన అర్జీలు ఇవీ..

● మూడేళ్ల క్రితం తనకు వివాహమైందని, నాటి నుంచి నేటి వరకు భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురి చేస్తున్నారని పెనమలూరుకు చెందిన సీత ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని, పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నా రని కన్నీరు పెట్టుకుంది. భర్తతో పాటు అత్తింటి వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరింది.

● తాను పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తుండగా తన స్నేహితుడు రూ.3 లక్షలు చెల్లిస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, డబ్బు తీసుకుని ఏడాదిగా ఉద్యోగం ఇప్పించ కుండా తప్పించుకు తిరుగుతున్నాడని పెడనకు చెందిన సాకేత్‌ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.

ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement