బంటుమిలి్ల: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలంలోని అర్తమూరు పంచాయితీ శివారు శాంతినగర్ గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక యువకుడు మరణించాడు. పోలీసుల సమాచారం మేరకు.. పెడన పట్టణానికి చెందిన అబ్దుల్ అఫీజ్ (19) బంటుమిల్లిలో ఉద్యోగ విధులు పూర్తి చేసుకుని పెడన వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంతో గాయపడిన అఫీజును నేషనల్ హైవే అంబులెన్స్‌లో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ అఫీజు మరణించాడు. బందరు నుంచి బంటుమిల్లి వైపు వస్తున్న కారు టైరు బరస్ట్ అయి అదుపు తప్పి ఎదురుగా అఫీజు బైక్‌ను కారు బలంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అఫీజు చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే ఘటనలో బాసినపాడు గ్రామానికి చెందిన మరో ద్విచక్ర వాహనదారుడు కట్టా నాగేశ్వరరావు కూడాఅదుపుతప్పి కింద పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్‌ఐ గణేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


