నందిగామ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బీఎల్‌ఓలు మొక్కుబడిగా వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలకు చెప్పి.. టీడీపీ బూత్ లెవెల్ కన్వీనర్లను మాత్రం వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్తున్నారు. టీడీపీకి చెందిన బీఎల్‌ఏలే ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. బీఎల్‌ఓలు చూస్తుండిపోతున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా టీడీపీ శ్రేణులకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు ఇక్కడ ఉన్న ఓటును తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా.. వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలు అడ్డుకొని ఆమెకు ఓటు హక్కు ఉండేలా చేశారు. – కంచికచర్ల


