కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026 దుర్గమ్మకు పలువురి విరాళాలు –8లోu మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు ఛీత్కారాలు ఇంకెంతకాలం!

న్యూస్‌రీల్‌

చల్లగా ఉండాలని జన దీవెన మళ్లీ మీరు వస్తేనే పేదలకు మేలని నినాదాలు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

పోలీసుల మోహరింపు..

శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలయ్యా.. మీరు అధికారంలో ఉంటేనే నిరుపేదల బతుకులు బాగుపడతాయి. మళ్లీ మీరు వస్తేనే మాలాంటి వారికి అండ’ అంటూ పెద్ద సంఖ్యలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘అన్నా.. ఒక్క ఫొటో తీసుకుంటా’ అంటూ ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగారు. కృష్ణలంక పోలీసుల వేధింపుల కారణంగా మే 21న ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్‌ కుటుంబ సభ్యులను గురువారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ రాకతో లబ్బీపేట, గ్రీన్‌ల్యాండ్స్‌ ప్రాంతం జనసందోహంగా మారింది.

తమ అభిమాన నేతను చూసేందుకు..

గ్రీన్‌ల్యాండ్స్‌ ప్రాంతంలో ఎక్కువగా పేదలు నివసిస్తుంటారు. ఆ ప్రాంతంలో నివసించే కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్తుంటారు. కానీ తమ ప్రాంతానికి వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పనులు మానుకొని ఇళ్ల వద్దే ఉన్నారు. తమ అభిమాన నేత రాక కోసం ఎదురు చూశారు. ఆయన మెయిన్‌ రోడ్డులో కారు దిగి క్రాంతికుమార్‌ ఇంటికెళ్లే దారిలో దాదాపు 300 మీటర్ల మేర మహిళలు పెద్ద ఎత్తున ఇరువైపులా నిల్చొని స్వాగతం పలికారు. ‘మీరు చల్లగా ఉండాలయ్యా.. మీరు ఉంటేనే మా లాంటి వాళ్లకు మేలు జరుగుతుంది. మళ్లీ మీరు అధికారంలోకి రావాలయ్యా’ అంటూ వృద్ధ మహిళలు వైఎస్‌ జగన్‌కు దీవెనలు అందించారు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ క్రాంతికుమార్‌ ఇంటివైపు వైఎస్‌ జగన్‌ కదిలి వెళ్లారు. అక్కడ క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంతగా ఎందుకు వేధింపులు వచ్చాయనే విషయాలను కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు వివరించారు.

అపార్ట్‌మెంట్‌లపై నుంచి..

వైఎస్‌ జగన్‌ రాకతో ఆ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లు భవనాలపై జనాలు కిటకిటలాడారు. ఆయన క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి వెళ్లే సమయానికి పకీరుగూడెం– లబ్బీపేట రోడ్డు జనసంద్రంగా మారింది. పకీరుగూడెంకి చెందిన మహిళలు తమ అభిమాన నేత ఆ ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ ఆ ఇంటి ప్రాంతం నుంచి మెయిన్‌రోడ్డుపై వచ్చే వరకూ వేచి చూశారు.

హోరెత్తిన నినాదాలు..

పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల కోసం వైఎస్‌ జగన్‌ కారు డోర్‌పై నుంచి నిల్చొని అభివాదం చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు అరాచక పాలన చేస్తున్న కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

తరలివచ్చిన నేతలు..

పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకరబాబు, నల్లగట్ల స్వామిదాసు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు ఎండీ రూహుల్లా, తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, పెనమలూరు పార్టీ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నత్తా యోనారాజు, మాజీ కార్పొరేటర్‌లు రెహానా నాహీద్‌, వియ్య పు అమర్నాథ్‌, పుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అలీం, ఎస్‌కే సుభానీ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల వేధింపుల కారణంగా మరణించిన క్రాంతికుమార్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ రాకతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేయగా, సౌత్‌ ఏసీపీ మానస, ఇంటెలిజెన్స్‌ ఏసీపీ మహేంద్ర, ట్రాఫిక్‌ ఏసీపీ పావన్‌కుమార్‌ ఆ ప్రాంతానికి వచ్చారు. వారితోపాటు, ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ పార్టీ, స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement