26వారాలకే జన్మించిన కవల శిశువులు | - | Sakshi
Sakshi News home page

26వారాలకే జన్మించిన కవల శిశువులు

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

26వారాలకే జన్మించిన కవల శిశువులు

62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి..

లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భం దాల్చిన 26 వారాలకే జన్మించిన కవల శిశువులకు 62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి తీసుకు వచ్చారు అక్కినేని ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా డాక్టర్‌ బి.సౌమ్య వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన షణ్ముఖ దేవికి 26 వారాల గర్భధారణలోనే ఒక మగ, ఆడ శిశువులు జన్మించారు. పుట్టిన సమయంలో వారి బరువు మగ శిశువు 850 గ్రాములు, ఆడశిశువు 812 గ్రాములు మాత్రమే ఉన్నారు. పిడియాట్రిక్‌ నిపుణులు డాక్టర్‌ డి.నరేంద్రబాబు, డాక్టర్‌ ఎం.పురంజయ్‌ నియోనాటల్‌ యూనిట్‌లో 62 రోజుల పాటు ఆ కవల శిశువులకు చికిత్స అందించారు. దీంతో శిశువులు ఇద్దరు బరువు దాదాపు 2 కేజీలకు పెరగడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement