గురజాడలో రూ.4 కోట్ల మట్టి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

గురజాడలో రూ.4 కోట్ల మట్టి దోపిడీ

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

గురజాడలో రూ.4 కోట్ల మట్టి దోపిడీ

అధికారులు, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దోపిడీలో ఎమ్మెల్యే వాటా ఎంతో బయటపెట్టాలి పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

పమిడిముక్కల: ‘గురజాడ వీర్రాజు చెరువులో అధికార పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు రూ.4 కోట్ల మట్టిని దోపిడీ చేశాడు. నిబంధనలకు విరు ద్ధంగా ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో తాటిచెట్టంత లోతున తవ్వేశాడు. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంతో బయట పెట్టాలి? ఇంత భారీ మట్టి దోపిడీ జరుగుతుటే పంచాయతీ, మండల, జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలి?’ అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. గురజాడ వీర్రాజు చెరువును పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి శనివారం పరిశీలించారు. కట్టలను బలపరచలేదని, తాటిచెట్టంత లోతు తవ్వేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చెరువు వద్ద అనిల్‌కుమార్‌ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మట్టి దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు సురేష్‌ బినామీ పేరుతో మట్టిని తవ్వి టిప్పర్లతో బయటకి తరలించి సొమ్ము చేసుకున్నా రని విమర్శించారు. మట్టి దోపిడీపై నిర్వాహకులను ప్రశ్నించిన గురజాడ గ్రామస్తులపై ఎస్‌ఐ, సీఐ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు.

నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీ

నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి, రొయ్యూరు, లంకపల్లి క్వారీల నుంచి ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోదని కై లే అనిల్‌కుమార్‌ విమర్శించారు. ఇసుక, మట్టి బినామీగా ఉండి రూ.కోట్లు బొక్కుతు న్నారని దుయ్యబట్టారు. కొమరవోలులో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన రూ.23 కోట్లను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎంత మట్టి, ఎంత ఇసుక దోపిడీ చేస్తారు, అంతులేని దోపిడీని అడ్డుకునే వారు లేరా అని ప్రశ్నించారు. ఇసుక, మట్టి దోపిడీ చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రతి పనిలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతితో తనకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఎమ్మెల్యేకు ఉందా అని నిల దీశారు. అధికారులు విచారణ జరిపి మట్టి దొంగ లకు జరిమానా విధించాలని సోమవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శొంఠి వెంకటేశ్వర రావు, యలమంచిలి గణేష్‌, కొడమంచిలి మహేష్‌, గొర్కెపూడి బుజ్జి, చింతలపూడి గవాస్కర్‌రాజు, తిరుమలశెట్టి బోసుబాబు, ఆరేపల్లి శ్రీనివాసరావు, రాజులపాటి మురళీ, యేనుగ మస్తాన్‌రావు, బొర్రా చినబాబు, రాజులపాటి గురవయ్య, నాగరాజు, షుకూర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement