సంధ్యా సమయం.. రెప్ప వాల్చనివ్వని మనోహర దృశ్యం..
చల్లని సాయంత్రం.. వర్ణాలమయమైన నింగి సింగారం..
మబ్బుల చాటుకు చేరిన దినకరుడి సహజ తేజం..
రామలింగేశ్వరుడి కొండపై పసిడికాంతుల ప్రవాహం..
కనుదృష్టిని మైమరపించే.. వర్ణనలకు అందని అద్భుతం..
చూసి పులకించని మది ఉంటుందా?
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంపై గురువారం సాయంత్రం సూర్య కిరణాలు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


