న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
ఎవరు పట్టుకున్నా ‘మేమున్నాం మీకేం కాదులే’ అంటూ కూటమి నాయకులు కల్పిస్తున్న ధైర్యంతో బందరు మండలంలో బెల్టుషాపు నిర్వాహకులకు ఎక్కడా లేని తెగింపు వచ్చేసింది. వీరికి తోడు సంబంధిత అధికారులు చూస్తూ చూడనట్లు నటిస్తుండటంతో బందరు నియోజకవర్గంలో బెల్టుషాపులు రోజురోజుకీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
7
ఇంద్రకీలాద్రి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు మంగళవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి పి. నారాయణ ఆయన వెంట ఉన్నారు.
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రం శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ 11వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.
‘అవునండీ అమ్ముకుంటాం.. ఏం అమ్ముకోకూడదా? ఇంకెవరూ అమ్ముకోవటంలేదా? మేమొక్కళ్లమే అమ్ముకుంటున్నామా? పోలీసులు పట్టుకుంటే పట్టుకోనివ్వండి.. నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తాం.. మళ్లీ అమ్ముకుని బతుకుతాం’ ఇదీ మచిలీపట్నం కాలేఖాన్‌పేటకు చెందిన ఓ బెల్టుషాపు నిర్వాహకురాలి ధీమా!
‘లక్షల్లో అమ్ముకునే వాళ్లకు లేని సిగ్గు మాకెందుకండీ.. ఏ వాళ్లే అమ్ముకుని లక్షలకు లక్షలు పోగుజేసుకోవాలా? పోలీసులు వాళ్లను పట్టుకోరా?అమాయకులమైన మమ్మల్ని మాత్రమే పట్టుకుని కేసులు పెడతారా? అసలు వ్యాపారులు అమ్మకుండా మా దగ్గరకి వాళ్ల సరుకు ఎలా వస్తుంది? వాటిని మేమెలా అమ్ముకోగలుగుతామండీ?’ ఇదీ బందరు మండలం మేకవానిపాలెంకు చెందిన మరో బెల్టుషాపు నిర్వాహకుడి మాటలు..
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎగువ నుంచి 400, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.


