కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న నూతన భవనాల్లో ఒక దానికి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతిలో ఆయన ప్రసంగించారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంబాబు, పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


