ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

వీరులపాడు: ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం గురువారం జరిగింది. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన నిమ్మల అచ్చమ్మ (50) గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా జయంతి నుంచి పెద్దాపురం గ్రామానికి వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ అభిమన్యు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement