జగ్గయ్యపేట అర్బన్: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్), విజయవాడ సీఈవో జి.కృష్ణన్ అన్నారు. అంత ర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వారోత్సవాలు–2026 లో భాగంగా బుధవారం ఆర్టీఐహెచ్, విజయవాడ, మెప్మా, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశ్రామికవేత్తల సాధికార కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఐహెచ్ సీఈవో కృష్ణన్ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్,ఈ–కామర్స్, జీఎస్టీ, ట్రేడ్‌మార్క్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, వ్యాపార అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 30 మందికి పైగా ఉద్యమ్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.
ఆర్టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్


