కారు, ద్విచక్ర వాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు, ద్విచక్ర వాహనం ఢీ

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

కారు, ద్విచక్ర వాహనం ఢీ

పెడన: పెడన – గుడివాడ జాతీయ రహదారిపై పల్లోటి స్కూలు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద జరిగిన ఓ కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. శని వారం మధ్యాహ్నం జరి గిన ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ఓ కారు పెడన నుంచి గుడివాడ వైపు ప్రయాణిస్తూ పెట్రోల్‌ బంకులోకి వెళ్లే క్రమంలో గుడివాడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న మండవల్లి ప్రాంతా నికి చెందిన పోగు నవీన్‌(38) కారును బలంగా ఢీకొట్టాడు. నవీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement