హనుమాన్‌జంక్షన్ రూరల్: అక్రమంగా గంజాయి రవణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి –కొమ్మూరు రహాదారిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందటంతో హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్.రమేష్, వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్ పథకం ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మల్లవల్లి –కొమ్మూరు రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కాలువ వాహన తనిఖీలు చేపట్టగా బైక్‌లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. మోటార్ సైకిల్‌ను తనిఖీ చేయగా 2.5 కిలోల గంజాయి లభించటంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు నిమ్మకూరి త్రినాథ్ (నూజివీడు), దండగల వెంకట ప్రసాద్ (మల్లవల్లి)లను అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు హాజరు పర్చారు.


