గంజాయిపై ఉక్కుపాదం మోపాలి | - | Sakshi
Sakshi News home page

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి సాగర్‌ నీటిమట్టం వివరాలు

నార్కో కో–ఆర్డినేషన్‌ కమిటీ

సమావేశంలో కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): డ్రగ్స్‌ వినియోగం, అమ్మకం, రవాణాపై ఉక్కుపాదం మోపి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో నార్కో కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో నిఘా పెంచాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన బాధితులను డి–ఎడిక్షన్‌ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈవో యూవీ సుబ్బారావు, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు ఎన్‌. పద్మావతి, ఎ. నాగరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినిసింగ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ వై. సత్యకిషోర్‌ పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement