గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నంలో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక విజయవాడ బస్‌స్టాప్‌ వెనక ఖాళీ స్థలంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు మృతుడి శరీరంగా స్వల్పంగా గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94406 27084, 94939 82040 నంబర్‌లకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement