ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరిగితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని బయటకు పంపొద్దు. మంచినీరు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. ఎండలో వేళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
–డాక్టర్ మాచర్ల సుహాసిని,
డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్


