ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్‌

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

● ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 44,365 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కాగా తొలి రోజు పరీక్షకు ఎన్టీఆర్‌ జిల్లాలో తొలి రోజు 4,721మంది పరీక్ష రాయాల్సి ఉండగా అందులో 4,270మంది హాజరయ్యారు. కృష్ణా జిల్లాలో 356మందికి 340మంది పరీక్ష రాశారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 కేంద్రాలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్‌, అగ్రికల్చల్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌– పరీక్ష(ఏపీఈఏపీసెట్‌)–2026 మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత(ఆన్‌లైన్‌) విధానంలో రాస్తున్నారు. ఈ పరీక్షలో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకూ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ పరీక్ష జరిగింది. గంట ముందుగా విద్యార్థులను పరీక్ష జరిగే ప్రాంగణంలోకి అనుమతించారు.

Advertisement
 
Advertisement
Advertisement