ఘనంగా అభయాంజనేయుడి రజత కవచ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అభయాంజనేయుడి రజత కవచ మహోత్సవం

May 12 2026 5:18 AM | Updated on May 12 2026 5:18 AM

రేమాలవారిపాలెం(నాగాయలంక): స్థానిక వంతెన సెంటర్‌లోని శ్రీఅభయాంజనేయ దేవస్థానంలో స్వామివారికి సోమ వారం రజత కవచ మహోత్సవం వైభవంగా జరిగింది. రేమాలవారిపాలెంనకు చెందిన గుడి కోటేశ్వరరావు – రత్నమంజుల, రాంబాబు – కృష్ణకుమారి స్వామికి 20 కిలోల వెండితో ఏడు అడుగుల కవచం సమర్పించిన నేపథ్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దాతల నేతృత్వంలో తొలుత వంతెన సెంటర్‌ నుంచి కవచ మహోత్సవ ఊరేగింపు నిర్వహించారు. కేరళ సంప్రదాయ చండీ మేళ తాళాలు, ఆధ్యాత్మిక కోలాట బృందాలతో భక్తులు నాగాయలంక ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. అనంతరం స్వామి విగ్రహానికి రజత కవచం సమర్పించి విశేషపూజ చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement