చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు, ఇజ్రాయిల్ దేశంలో హోం బేస్డ్ కేర్ యువర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాలకు 25 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, కనీసం పదో తరగతి విద్యార్హతతో పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరామ్స్ నెలకు 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం పొందవచ్చునన్నారు. ఇజ్రాయిల్ దేశంలో హోం బేస్డ్ కేర్ యువర్ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు అర్హులన్నారు. జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంగ్లిషు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని, ఎంపికై న వారికి నెలకు రూ.1,99,770 వరకు ఆదాయం పొందవచ్చునన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి సంస్థ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 96767 08041 నంబరును సంప్రదించాలన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


